About Kuchipudi Bhagavathamelam

My photo
Kuchipudi Bhagavathamelam with a recorded history of centuries of being the torch bearers of the Kuchipudi art form having preserved, propagated and promoted the art form have taken upon themselves to ensure that the rich traditions are handed over to the next generation so that it is passed on for posterity. This official blog space would address various aspects of past, present and future - related to Kuchipudi art form an endeavour to be a one stop over for all the aspects of the art form.

Sunday, 7 December 2014

Preserve Kuchipudi Natyam (Nataka Dharmam)

భరతముని ప్రవక్తమైన నాట్య శాస్త్రాన్ని అనుసరించి,  దేశ కాల వర్తమానపరిస్థితులకు భాష,కాల,వర్తమాన పరిస్తుతులకు అనుగుణంగా ..అనేక నాట్య, నృత్యరీతులు ఏర్పడ్డాయిప్రాయోగికులు,అలంకారికులువిమర్శకులుశాస్త్రజ్ఞులు సైతం చెప్పిన ఒక గొప్ప సంఘటనఏమిటంటేభరతముని ప్రవక్తమైన నాట్య శాస్త్రాన్ని నూటికి నూరు పాళ్ళు ప్రదర్శించే నాట్య కళలు ఈ భారతదేశంలో ఉన్నాయీ అంటేఅవి రెండే రెండుఒకటి కథాకళి,రెండు కూచిపూడి.

అంతటి విశిష్టమైన స్థానాన్ని కూచిపూడికి అందించిన మహోన్నతమైన ఘనకీర్తి కూచిపూడి భాగవతులకు దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

భరతముని ఏదయితే నాట్యశాస్త్రంలో 11 అంకాలుగా విభజించి నాట్య శాస్త్రం యొక్కగొప్పతనాన్ని వివరించాడోనాటక ధర్మాన్ని వివరించాడోఆ నాటక ధర్మాన్ని కొనసాగించినవారు కూచిపూడి సంప్రదాయ  భాగవతులుఆ భాగవతుల పరంపరని నేటికీ వాళ్ళ శిష్య ప్రశిష్యులు కొనసాగిస్తూనే ఉన్నారు.
కానీదౌర్భాగ్యవశాత్తూ ఏమైపోయిందంటే,  ఆ నాటక సాంప్రదాయం నేడు నృత్యసాంప్రదాయంగా మారిపోయింది.

ప్రపంచంలో కూచిపూడికి జరిగిన పట్టాభిషేకం మరేనాట్య నృత్య  రీతులకు జరగలేదు.దాదాపు 36 దేశాల్లో ఈ రోజున కూచిపూడి నాట్యానికి పట్టాభిషేకం జరుగుతుందన్నాసిలికానాంధ్ర వంటి సంస్థలు కూచిపూడి నాట్యానికి ఇన్ని గిన్నీస్ రికార్డులు సాధిస్తున్నా అది కూచిపూడి నాటక రంగ ఘనతేనని చెప్పుకోవాలి.

మిగతా ఏ నాట్య రీతులను చూసినా సరేముందుగా కూచిపూడి యొక్కప్రభావాన్ని ఒకసారి గమనించి చూద్దాం
సంస్కృత రూపకాలతో మొదలయినఅంటే కాళిదాసుయొక్క సంస్కృత కావ్యాలతో   భాగవతులు అంచిత.. కుంచిత సమపాదాలతో కేవలం వాచక ప్రాధాన్యంగా ఈ సంస్కృత రూపకాలను తీసుకు రావడం జరిగింది.  నేడు ఈ సంస్కృత రూపకాలు అంతరించి పోయాయిదానికి కారణమేమిటంటేదానిని ప్రిజర్వింగ్ చేసుకునే  పరిస్థితి లేకపోయి వుండవచ్చుఆనాటి సామాజిక పరిస్థితులకనుగుణంగా ముద్రణా లోపమయి ఉండొచ్చులేదా ఆ పరంపరని కొనసాగించే వాళ్ళు లేకపోవడమయినా కావచ్చు.  ఏదయినాగానీజాతి గర్వించదగిన సంస్కృత రూపకాలను కోల్పోయాం
జనని సంస్కృతం అని గొప్పగా చెప్పుకుంటున్నాం గానీఒక నాట్య రూపకానికి జీవంపోసిన సంస్కృత రూపకాలు అవి ఏవయినా కావచ్చుఏవో మృచ్చకటికం అదీ ఇదీ అని పుస్తకాల్లో పేర్లయితే ఉన్నాయి గానీ అవి పోయిందంటేదానికి  మనందరమూ కారకులే కావచ్చు,ఆనాటినుంచీ  తర్వాత్తర్వాత జరుగుతున్న అనేకానేకానేక  పరిణామాలూ కావచ్చులేదా.. అప్పుడు తెలుగు సాహిత్య ప్రభావం పెరగడమయినా కావచ్చు.  సంస్కృతానికి తెలుగుకు మధ్య పెరిగే భాషా పరిణామ క్రమమయినా కావచ్చుఏదయినా కారణాలు అనుకోండి.మొత్తానికి ఒక పరంపరని కొనసాగించే క్రమంలో ఆదిలోనే బ్రేక్ పడిందిఆ విధానాలెలా ఉంటాయనేది తెలియకపోవడం.... బాధాకరం !!
ఆ తర్వాత వచ్చినవి కలాపాలు

ఇక్కడ నేను చెప్పదలచినదేమిటంటేకూచిపూడి కేవలం నాట్య ప్రక్రియ మాత్రమేసాహిత్యాన్నిసంగీతాన్ని ఆలంబనగా చేసుకుని దీని పరిణామక్రమం జరిగిందికూచిపూడిలో నాట్యానికినాటకానికి ఎంతటి ప్రాధాన్యతయితే ఉందోసాహిత్యానిసంగీతానికూడా అంతే పెద్ద పీట వేశారుఈ రెండిటినీ ఆలంబనగా చేసుకునే కూచిపూడి దాని పరిణతిని సాధించింది.  మిగతా నృత్య రీతులను చూసినట్టయితేఇంతటి విస్తృతమైన సాహిత్యం,  ఒక తెలుగు భాషలోనే కనబడుతుండి .. అని నా నిశ్చింతాభిప్రాయంమలయాళతమిళకన్నడమరే ఇతర భాషల్లోనయినా కావచ్చు,  ఆ భాషలకు తనకంటూ సంస్థాగతమైన స్వభావాలు ఉన్నప్పటికీ,తెలుగు భాషకున్న విస్తృతి మరే భాషకూ లేదోమోనని నానమ్మకం .   కానీఆయా ప్రాంతాల్లో పుట్టిన నాట్యాలుఅక్కడి భాషల్లో సాహిత్యాన్ని పెంచుకుంటున్నాయా అంటేప్రశ్నార్థకమే!  కూచిపూడి మాత్రం సాహిత్యాన్ని తనలో అంతర్లీనంగా చేసేసుకుంది.  
పరమేశ్వరుడు పార్వతికి అర్థభాగాన్నిచ్చినట్టుబ్రహ్మ నాలుకపై వాణిని నిలినట్టువిష్ణువు హృదయ పీఠం లక్ష్మీదేవికి సమర్పించినట్టుకూచిపూడిలో సాహిత్యం ఇమిడి పోయిందిఅంతటి గొప్పసాంప్రదాయానికి పెద్ద పీట వేశారు మన భాగవతులుఆ పరంపరని కొనసాగిస్తున్న గొప్పశిష్య బృందాలు.
మళ్ళీఓ సంగతిఇక్కడ భాగవతులు అంటేకుఛిపూడిని కొనసాగిస్తున్న వారు మాత్రమే కాదుభగవత్ సంబంధమైన పాడువారుఆడువారు ఎవరైనాగానీ అని ఆర్యోక్తి ని గమనినించాలి .  కాకపోతేఈ ప్రక్రియను ఎవరైతే కొనసాగిస్తున్నారోగుర్తించిన వారూ,దానికొక స్థాయిని కల్పించినవారువారికి అత్యంత ప్రముఖ స్థానం ఉంటుంది
ఇక్కడ నేను చెప్పదలచింది సంస్కృత రూపకాలు అంతరించి పోయాయి.తర్వాతివి కలాపాలు.  నిఘంటు ప్రకారంపురివిప్పిన నెమలివజ్రాలు పొదిగినవడ్డాణంజడగొడవ వగైరా నానార్థాలున్నాయి.
ఈ కలాపము అనేది దశ రూపకాలకు ఉప రూపకాలైన శ్రీ గతితము అనబడే రూపకంపై ఆధారపడి ఈ కలాప ప్రక్రియ కొనసాగుతుందిస్త్రీ జాతి ఔన్నత్యం,ఆహార్యం, వ్యక్తిత్వంవిలువలువైవాహిక అనురాగం వంటివన్నీ నిలువెత్తు అద్దంలా చూపెట్టింది భామా కలాపం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాధ సత్యనారాయణగారు  ఈ భామా కలాపాన్ని చూసి "వడగట్టిన అలంకార శాస్త్రం ఇదిఅన్నారు.  తనఏకవీరలో రాసుకున్నారు.  'గొల్ల కలాపము షట్శాస్త్రాలకూ ఆలంబనము' అని రాశారు 
అటువంటి సంఫ్రదాయానికి తలమానికంగా నిలిచినవాడు సిద్ధేంద్ర యోగి.
 అంతవరకు కూచిపూడి భాగవతులు సంస్కృత రూపకాలతో ఆడుతూ వస్తే,సిద్ధేంద్రుని ఆ కళా ప్రక్రియను గనుక తీసుకుంటేఇంత గొప్ప సాహిత్య ప్రబంధంలో దీంట్లో అష్టవిధ శృంగార నాయికల అవస్థలుసాత్విక అభినయాలుసంచారి భావాలుఅభిసారిక భావాలువ్యభిచారిక భావాలు.. ఇలా ఒక నాయికా  భావాలకు సంబంధించిన నాయిక ప్రస్థానం ఎంతయితే ఉందోఆ ప్రస్థానం మొత్తాన్నివివరంగా చూపిచారు ఆ స్త్రీ ముక్కుకు  ముక్కెరకున్న విధాన్ని తెలియజెప్పాడు కందార్థంలో"అంగన లేని ఇల్లుయు , చతురంగ బలములు లేని రాజుయున్, ....నిస్సంగుడు కాని మౌనిస్త్రీలకున్ ముంగిర లేని భూషణముమోదమటే భువనైక సుందరీఅనిఅంటే మూడు పాత్రలతో నాటకీయతను చూపించాడు-
కలాపాల తర్వాత.. కేళికలు వచ్చాయిసమాజ దురాచారాలనుదురాగతాలను ప్రజలకు తెలియపరుస్తూచైతన్యపరుస్తూవాటికి నివారణోపాయాన్ని చూపిస్తూ,ఒక నాటకీయతను చూపించారు కేళికల్లో.
తర్వాతివి యక్షగానాలుకూచిపూడికి రెండు కళ్ళుగా నిలిచాయి కలాపంయక్షగానం.
భరతముని నాట్యశాస్త్రంలో ఏదయితే జజ్జర అని వర్ణించాడో,  దానినే కూచిపూడి భాగవతులు కుటిలకము అని చూపిస్తున్నారుఅలాగేపూర్వవీధి,దరువులుకందార్థాలుతేటగీతులుకందాలుమత్తేభాలుశార్దూలాలు… ఇలా సాహిత్యాన్ని విరివిగా మనం యక్షగానాల్లో చూడవచ్చు.  భరతమునిచెప్పినదరువుల లక్షణాలు,  ప్రవేశికప్రాదేశిక, అంతరసంవాదవర్ణాత్మక దరువులు ఏవయినా కావచ్చుభరతముని చెప్పినటువంటి భుజంగాలిలా ఉండాలి,  పంచచామరాలిలా ఉండాలి వంటి సాహిత్యాన్ని మనం యక్షగానాల్లో చూడవచ్చు.
తర్వాత వెంపటిగారి అద్భుతమైన రూపకాలొచ్చాయి.  దీనిలో నాట్యంతో పాటు,నృత్యానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తూయక్షగానాల్లో వాచికానికి ఉన్నప్రాధాన్యతను కొంత వరకు తగ్గిస్తూఅంటే జనాలకు మారుతున్న కాలానికి అనుగుణంగా కొంత మార్పులు చేర్పులు సాగిస్తూముందుకు సాగితేనే ఆ చైతన్యప్రవాహం అలా కొనసాగుతుంది..అని భావించి 
 జన నాడి తెలిసిన వెంపటివారు రు యక్షగానం విస్తృతి పెద్దది కావడంతో దానిని ఆకళింపు చేసుకునే శక్తి సామాన్యులకు లేదన్న సంగతి గ్రహించిప్రత్యేకంగా నృత్యరూపకాలు రూపొందించారు.  అంత భాష,  సాహిత్యసంగీతనాటక ప్రక్రియలు జనాల్లో కొరవడిన రోజున,  అన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న వెంపటిగారుసోలోలని కూడా తీసుకువచ్చినప్పటికీరూపక ప్రక్రియను మాత్రం వదల్లేదు.  ఆ నాట్య ప్రక్రియను ఏనాడూ వదల్లేదు.
కానీనేడు కేవలం వ్యస్థ నృత్యాంశాలు,(  సోలోలు )
మాత్రమే కూచిపూడి నాట్యంగా భావిస్తున్నట్లు మనం చూస్తున్నాంఅవి తప్పని నేనడం లేదు.  కానీనృత్యమేకూచిపూడి నాట్యం మాత్రం కాదు.  కూచిపూడి నాట్య ప్రక్రియనాటకప్రక్రియనాటక ధర్మాన్ని కొనసాగించాల్సిన అవసరమైతే మనకు ఉంది
మారుతున్న కాలాన్నిబట్టి మారుతున్నాంఅంతంత వాచికాలను చేయడానికి ఎవరున్నారు,  ఈ రోజున ఒక డాన్స్  బాలే చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నపనిఅందరినీ కలుపుకోవాలిఒక రచయిత దొరకాలి,  సంగీతకారుడు దొరకాలిఇవన్నీ కష్టంగా ఉందీ అంటున్నారుకష్టంగా ఉంటే ప్రక్రియను మార్చేస్తావా!కష్టంగా ఉంటే అవగతం చేసుకో,  టెంత్ క్లాసులో సబ్జెక్ట్ కష్టంగా ఉందినేను మూడో క్లాసోరెండో తరగతివో పాఠాలు పెట్టమని అడుగుతావామరిఅవి అడగనప్పుడు,వంశానుగతంగా కొన్ని తరాలవాళ్ళు తమ జీవితాల్ని అంకితం చేసి,  ఒకపరిపూర్ణమైన రూపాన్నిచ్చినదానిని నువ్వేమో సామాజిక పరిస్థితులిలా ఉన్నాయి,ఇంకోటి అలా ఉంది దీని రూపాన్ని మార్చే హక్కుధర్మం ఎవరికి ఉంది?  నువ్వు దానికి తగ్గట్టుగా ఆ స్థితికి వెళ్ళులేకపోతే ఆ పరిమాణం అంతరాన్ని తగ్గించువేదాలు ఉపనుషత్తులుగాఉపనిషత్తులు తర్వాత్తర్వాత వివరణాత్మక వ్యాసాలుగా వచ్చినయివాటి మూలాలను కాపాడుకుంటూ ప్రసిద్ధ కవులు కొంత కొంతరాసుకుంటూ వచ్చారునా చిన్నతనంలో మొత్తం పాఠాన్ని చదివితేగానీచివరలోప్రశ్నలకు జవాబులు దొరికేవి కావుఇప్పుడు టెక్స్ట్ బుక్ పోయి గైడ్లు వచ్చాయి.తర్వాత మోడల్ పేపర్స్ వచ్చాయిఈ రోజున ఏ బి సి డిలు వచ్చాయి.పిల్లలకుకూడా గుర్తుండేవి ఏ బిసిడిలు మాత్రమే!  విద్యనేది పోతోందిఇంకా ఘోరమైన విషయం ఏమిటంటేనాట్య ప్రక్రియనేది నృత్య ప్రక్రియగా మారిపోవడం దౌర్భాగ్యంఈ రోజున కూచిపూడి నాట్య ప్రక్రియ దాని రూపాన్ని కోల్పోయింది.దీనికి అందరమూ బాధ్యులమేకూచిపూడి భాగవతులు కావచ్చుభాగవతేతరులు కావచ్చు.  ఎవరైనా సరే ధర్మాన్ని కొనసాగించాలి.
నాట్యాన్ని మనం ఒక్కళ్ళమే చేయడం లేదు.  కథాకళికన్నడ యక్ష గానాలు,మేలటూరు భాగవతులు వగైరాలెందరో చేస్తున్నారు. కాంటెంపరరీ వాళ్ళుకూడా నాటక ప్రక్రియను చూపిస్తున్నారు కదండీనాటకాల్లోని లోపాలను మనం ఒక్కళ్ళమే వెదుక్కుంటున్నామా?
ఇదంతా కేవలం వ్యక్తిగతంగా పేరు సంపాదించుకోవడం కోసంవ్యక్తిగత లాభాలు,ఆర్థిక పరిపుష్టికోసం నాటకాలను తొక్కేస్తూ కూచిపూడినాట్యాన్ని బతికిస్తున్నామని మనం బతుకుతున్నామేమో ?దీన్ని మన అంతరాత్మ  ఏపరిస్థిలోనూ ఒప్పుకోకూడదు.  ఇంతటి సాహితీవేత్తలువిమర్శకులూ సైతం  కళ్ళున్నగుడ్డివాళ్ళుగా వ్యవహరిస్తున్నారు.  నాట్య ప్రక్రియను నృత్య ప్రక్రియగా మార్చే హక్కు ఎవరికి ఉంది అని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు.  రచయితలు ..విమర్శ కులూ కూడా మెచ్చుకోళ్ళకోసమే రాస్తున్నారు తప్పవిచక్షణ మరచిపోతున్నారు.  యక్షగానాలు నృత్య నాటికలయ్యాయినాటికలు రూపకాలుగా మారినయి… ఇలా మారుతున్నాయన్నది గ్రహించండిఎన్ని మార్పులు చేర్పులు జరిగినా నాటకధర్మంమాత్రం పోలేదు.  ఈ సోలో ప్రదర్శనలతో  సంచారీలు చేస్తూ నాటకీయత చూపిసున్నాం అని వాదించా వచ్చేమో గానీ నాటక ధర్మం పోతోందికాదా చతుర్విధాభినయాల్లో లోటు జరుగుతూన్నట్లేగా ?  
నాట్యం న్నాటకంచైవ ... పూజ్యులు పూర్వులు చెప్పినమాట ఆచంద్రతారార్కం వర్ధిల్లుగాక ...........                     
-- తాడేపల్లి 


No comments:

Post a Comment