భరతముని
ప్రవక్తమైన నాట్య శాస్త్రాన్ని
అనుసరించి, దేశ కాల వర్తమానపరిస్థితులకు
భాష,కాల,వర్తమాన పరిస్తుతులకు అనుగుణంగా ..అనేక నాట్య,
నృత్యరీతులు ఏర్పడ్డాయి. ప్రాయోగికులు,అలంకారికులు, విమర్శకులు, శాస్త్రజ్ఞులు
సైతం చెప్పిన ఒక గొప్ప సంఘటనఏమిటంటే, భరతముని
ప్రవక్తమైన నాట్య శాస్త్రాన్ని
నూటికి నూరు పాళ్ళు ప్రదర్శించే నాట్య కళలు ఈ
భారతదేశంలో ఉన్నాయీ అంటే, అవి రెండే
రెండు. ఒకటి కథాకళి,రెండు
కూచిపూడి.
అంతటి
విశిష్టమైన స్థానాన్ని కూచిపూడికి అందించిన మహోన్నతమైన ఘనకీర్తి
కూచిపూడి భాగవతులకు దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
భరతముని
ఏదయితే నాట్యశాస్త్రంలో 11 అంకాలుగా విభజించి నాట్య శాస్త్రం యొక్కగొప్పతనాన్ని వివరించాడో, నాటక ధర్మాన్ని వివరించాడో, ఆ నాటక ధర్మాన్ని కొనసాగించినవారు కూచిపూడి
సంప్రదాయ భాగవతులు, ఆ భాగవతుల
పరంపరని నేటికీ వాళ్ళ శిష్య ప్రశిష్యులు కొనసాగిస్తూనే ఉన్నారు.
కానీ, దౌర్భాగ్యవశాత్తూ
ఏమైపోయిందంటే, ఆ నాటక సాంప్రదాయం నేడు నృత్యసాంప్రదాయంగా
మారిపోయింది.
ప్రపంచంలో
కూచిపూడికి జరిగిన పట్టాభిషేకం మరేనాట్య నృత్య రీతులకు జరగలేదు.దాదాపు 36 దేశాల్లో ఈ
రోజున కూచిపూడి నాట్యానికి పట్టాభిషేకం
జరుగుతుందన్నా, సిలికానాంధ్ర వంటి సంస్థలు కూచిపూడి నాట్యానికి ఇన్ని
గిన్నీస్ రికార్డులు సాధిస్తున్నా… అది కూచిపూడి నాటక రంగ ఘనతేనని చెప్పుకోవాలి.
మిగతా ఏ
నాట్య రీతులను చూసినా సరే, ముందుగా
కూచిపూడి యొక్కప్రభావాన్ని ఒకసారి గమనించి చూద్దాం.
సంస్కృత రూపకాలతో మొదలయిన, అంటే
కాళిదాసుయొక్క సంస్కృత కావ్యాలతో భాగవతులు అంచిత.. కుంచిత సమపాదాలతో
కేవలం వాచక ప్రాధాన్యంగా ఈ సంస్కృత రూపకాలను తీసుకు రావడం జరిగింది. నేడు ఈ
సంస్కృత రూపకాలు అంతరించి పోయాయి. దానికి
కారణమేమిటంటే, దానిని
ప్రిజర్వింగ్ చేసుకునే పరిస్థితి లేకపోయి వుండవచ్చు. ఆనాటి
సామాజిక పరిస్థితులకనుగుణంగా ముద్రణా లోపమయి
ఉండొచ్చు. లేదా ఆ
పరంపరని కొనసాగించే వాళ్ళు లేకపోవడమయినా కావచ్చు. ఏదయినాగానీ, జాతి
గర్వించదగిన సంస్కృత రూపకాలను
కోల్పోయాం.
జనని
సంస్కృతం అని గొప్పగా చెప్పుకుంటున్నాం గానీ, ఒక నాట్య రూపకానికి జీవంపోసిన సంస్కృత రూపకాలు అవి ఏవయినా కావచ్చు, ఏవో
మృచ్చకటికం అదీ ఇదీ అని పుస్తకాల్లో పేర్లయితే ఉన్నాయి గానీ, అవి
పోయిందంటే, దానికి
మనందరమూ కారకులే కావచ్చు,ఆనాటినుంచీ తర్వాత్తర్వాత జరుగుతున్న అనేకానేకానేక పరిణామాలూ కావచ్చు, లేదా.. అప్పుడు
తెలుగు సాహిత్య ప్రభావం పెరగడమయినా కావచ్చు. సంస్కృతానికి
తెలుగుకు మధ్య పెరిగే భాషా పరిణామ క్రమమయినా
కావచ్చు, ఏదయినా
కారణాలు అనుకోండి.మొత్తానికి
ఒక పరంపరని కొనసాగించే క్రమంలో ఆదిలోనే బ్రేక్
పడింది. ఆ
విధానాలెలా ఉంటాయనేది తెలియకపోవడం.... బాధాకరం !!
ఆ తర్వాత వచ్చినవి కలాపాలు.
ఇక్కడ నేను చెప్పదలచినదేమిటంటే, కూచిపూడి
కేవలం నాట్య ప్రక్రియ మాత్రమే. సాహిత్యాన్ని, సంగీతాన్ని
ఆలంబనగా చేసుకుని దీని పరిణామక్రమం జరిగింది. కూచిపూడిలో నాట్యానికి, నాటకానికి
ఎంతటి ప్రాధాన్యతయితే ఉందో, సాహిత్యాని, సంగీతానికూడా
అంతే పెద్ద పీట వేశారు. ఈ రెండిటినీ
ఆలంబనగా చేసుకునే కూచిపూడి దాని పరిణతిని సాధించింది. మిగతా నృత్య రీతులను చూసినట్టయితే, ఇంతటి
విస్తృతమైన సాహిత్యం, ఒక తెలుగు భాషలోనే కనబడుతుండి .. అని నా
నిశ్చింతాభిప్రాయం. మలయాళ, తమిళ, కన్నడ, మరే ఇతర భాషల్లోనయినా కావచ్చు, ఆ భాషలకు
తనకంటూ సంస్థాగతమైన స్వభావాలు
ఉన్నప్పటికీ,తెలుగు
భాషకున్న విస్తృతి మరే భాషకూ లేదోమోనని
నానమ్మకం . కానీ, ఆయా
ప్రాంతాల్లో పుట్టిన నాట్యాలు, అక్కడి
భాషల్లో సాహిత్యాన్ని పెంచుకుంటున్నాయా అంటే, ప్రశ్నార్థకమే! కూచిపూడి
మాత్రం సాహిత్యాన్ని తనలో అంతర్లీనంగా చేసేసుకుంది.
పరమేశ్వరుడు
పార్వతికి అర్థభాగాన్నిచ్చినట్టు, బ్రహ్మ నాలుకపై
వాణిని నిలినట్టు, విష్ణువు
హృదయ పీఠం లక్ష్మీదేవికి సమర్పించినట్టు, కూచిపూడిలో సాహిత్యం ఇమిడి
పోయింది. అంతటి
గొప్పసాంప్రదాయానికి పెద్ద పీట వేశారు మన భాగవతులు, ఆ పరంపరని కొనసాగిస్తున్న గొప్పశిష్య బృందాలు.
మళ్ళీ, ఓ సంగతి, ఇక్కడ భాగవతులు అంటే, కుఛిపూడిని
కొనసాగిస్తున్న వారు మాత్రమే కాదు, భగవత్
సంబంధమైన పాడువారు, ఆడువారు ఎవరైనాగానీ అని
ఆర్యోక్తి ని గమనినించాలి . కాకపోతే, ఈ
ప్రక్రియను ఎవరైతే కొనసాగిస్తున్నారో, గుర్తించిన వారూ,దానికొక స్థాయిని
కల్పించినవారు, వారికి
అత్యంత ప్రముఖ స్థానం
ఉంటుంది.
ఇక్కడ నేను చెప్పదలచింది… సంస్కృత రూపకాలు
అంతరించి పోయాయి.తర్వాతివి
కలాపాలు. నిఘంటు
ప్రకారం, పురివిప్పిన నెమలి, వజ్రాలు పొదిగినవడ్డాణం, జడ, గొడవ వగైరా నానార్థాలున్నాయి.
ఈ కలాపము
అనేది దశ రూపకాలకు ఉప రూపకాలైన శ్రీ గతితము అనబడే రూపకంపై ఆధారపడి ఈ కలాప ప్రక్రియ కొనసాగుతుంది. స్త్రీ జాతి
ఔన్నత్యం,ఆహార్యం, వ్యక్తిత్వం, విలువలు, వైవాహిక అనురాగం వంటివన్నీ నిలువెత్తు అద్దంలా
చూపెట్టింది భామా కలాపం. జ్ఞానపీఠ
అవార్డు గ్రహీత విశ్వనాధ సత్యనారాయణగారు ఈ భామా కలాపాన్ని చూసి "వడగట్టిన అలంకార శాస్త్రం
ఇది" అన్నారు. తనఏకవీరలో
రాసుకున్నారు.
'గొల్ల కలాపము
షట్శాస్త్రాలకూ ఆలంబనము' అని రాశారు.
అటువంటి
సంఫ్రదాయానికి తలమానికంగా నిలిచినవాడు సిద్ధేంద్ర యోగి.
అంతవరకు
కూచిపూడి భాగవతులు సంస్కృత రూపకాలతో
ఆడుతూ వస్తే,సిద్ధేంద్రుని
ఆ కళా ప్రక్రియను గనుక తీసుకుంటే, ఇంత గొప్ప సాహిత్య ప్రబంధంలో దీంట్లో అష్టవిధ శృంగార నాయికల అవస్థలు, సాత్విక అభినయాలు, సంచారి
భావాలు, అభిసారిక భావాలు, వ్యభిచారిక భావాలు.. ఇలా ఒక నాయికా భావాలకు సంబంధించిన నాయిక ప్రస్థానం ఎంతయితే ఉందో, ఆ ప్రస్థానం
మొత్తాన్నివివరంగా చూపిచారు . ఆ స్త్రీ ముక్కుకు ముక్కెరకున్న విధాన్ని తెలియజెప్పాడు
కందార్థంలో. "అంగన లేని ఇల్లుయు , చతురంగ బలములు
లేని రాజుయున్, ....నిస్సంగుడు
కాని మౌని, స్త్రీలకున్
ముంగిర లేని భూషణము, మోదమటే
భువనైక సుందరీ" అని. అంటే మూడు
పాత్రలతో నాటకీయతను చూపించాడు-
కలాపాల తర్వాత.. కేళికలు
వచ్చాయి. సమాజ దురాచారాలను, దురాగతాలను ప్రజలకు
తెలియపరుస్తూ, చైతన్యపరుస్తూ, వాటికి
నివారణోపాయాన్ని చూపిస్తూ,ఒక నాటకీయతను చూపించారు కేళికల్లో.
తర్వాతివి
యక్షగానాలు. కూచిపూడికి
రెండు కళ్ళుగా నిలిచాయి కలాపం, యక్షగానం.
భరతముని
నాట్యశాస్త్రంలో ఏదయితే జజ్జర అని
వర్ణించాడో, దానినే
కూచిపూడి భాగవతులు కుటిలకము అని చూపిస్తున్నారు. అలాగే, పూర్వవీధి,దరువులు, కందార్థాలు, తేటగీతులు, కందాలు, మత్తేభాలు, శార్దూలాలు… ఇలా
సాహిత్యాన్ని విరివిగా మనం యక్షగానాల్లో చూడవచ్చు. భరతమునిచెప్పినదరువుల లక్షణాలు, ప్రవేశిక, ప్రాదేశిక, అంతర, సంవాద, వర్ణాత్మక దరువులు ఏవయినా కావచ్చు. భరతముని
చెప్పినటువంటి భుజంగాలిలా ఉండాలి, పంచచామరాలిలా ఉండాలి వంటి సాహిత్యాన్ని
మనం యక్షగానాల్లో చూడవచ్చు.
తర్వాత వెంపటిగారి అద్భుతమైన రూపకాలొచ్చాయి. దీనిలో
నాట్యంతో పాటు,నృత్యానికి
కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ, యక్షగానాల్లో
వాచికానికి ఉన్నప్రాధాన్యతను కొంత వరకు
తగ్గిస్తూ, అంటే జనాలకు
మారుతున్న కాలానికి అనుగుణంగా కొంత మార్పులు చేర్పులు సాగిస్తూ, ముందుకు
సాగితేనే ఆ చైతన్యప్రవాహం అలా కొనసాగుతుంది..అని భావించి
జన నాడి తెలిసిన వెంపటివారు
రు యక్షగానం విస్తృతి పెద్దది కావడంతో దానిని ఆకళింపు చేసుకునే శక్తి సామాన్యులకు
లేదన్న సంగతి గ్రహించి, ప్రత్యేకంగా
నృత్యరూపకాలు రూపొందించారు. అంత భాష, సాహిత్య, సంగీత, నాటక ప్రక్రియలు జనాల్లో కొరవడిన రోజున, అన్నిటినీ
దృష్టిలో పెట్టుకున్న వెంపటిగారు, సోలోలని
కూడా తీసుకువచ్చినప్పటికీ, రూపక ప్రక్రియను మాత్రం వదల్లేదు. ఆ నాట్య ప్రక్రియను ఏనాడూ వదల్లేదు.
కానీ, నేడు కేవలం
వ్యస్థ నృత్యాంశాలు,( సోలోలు )
మాత్రమే
కూచిపూడి నాట్యంగా భావిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అవి తప్పని నేనడం లేదు. కానీ, నృత్యమే, కూచిపూడి
నాట్యం మాత్రం కాదు. కూచిపూడి
నాట్య ప్రక్రియ, నాటకప్రక్రియ. నాటక ధర్మాన్ని కొనసాగించాల్సిన అవసరమైతే మనకు ఉంది.
మారుతున్న కాలాన్నిబట్టి మారుతున్నాం. అంతంత వాచికాలను చేయడానికి ఎవరున్నారు, ఈ రోజున ఒక డాన్స్ బాలే చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నపని, అందరినీ
కలుపుకోవాలి, ఒక రచయిత దొరకాలి, సంగీతకారుడు
దొరకాలి…ఇవన్నీ
కష్టంగా ఉందీ అంటున్నారు. కష్టంగా
ఉంటే ప్రక్రియను మార్చేస్తావా!కష్టంగా ఉంటే అవగతం చేసుకో, టెంత్
క్లాసులో సబ్జెక్ట్ కష్టంగా ఉంది, నేను మూడో క్లాసో, రెండో
తరగతివో పాఠాలు పెట్టమని అడుగుతావా? మరి, అవి
అడగనప్పుడు,వంశానుగతంగా
కొన్ని తరాలవాళ్ళు తమ జీవితాల్ని
అంకితం చేసి, ఒకపరిపూర్ణమైన రూపాన్నిచ్చినదానిని నువ్వేమో సామాజిక పరిస్థితులిలా ఉన్నాయి,ఇంకోటి అలా
ఉంది దీని రూపాన్ని మార్చే హక్కు, ధర్మం ఎవరికి ఉంది? నువ్వు
దానికి తగ్గట్టుగా ఆ స్థితికి వెళ్ళు, లేకపోతే ఆ పరిమాణం అంతరాన్ని
తగ్గించు. వేదాలు
ఉపనుషత్తులుగా, ఉపనిషత్తులు
తర్వాత్తర్వాత వివరణాత్మక వ్యాసాలుగా
వచ్చినయి. వాటి
మూలాలను కాపాడుకుంటూ ప్రసిద్ధ కవులు కొంత కొంతరాసుకుంటూ
వచ్చారు. నా
చిన్నతనంలో మొత్తం పాఠాన్ని చదివితేగానీ, చివరలో4 ప్రశ్నలకు
జవాబులు దొరికేవి కావు. ఇప్పుడు
టెక్స్ట్ బుక్ పోయి గైడ్లు వచ్చాయి.తర్వాత మోడల్
పేపర్స్ వచ్చాయి. ఈ రోజున ఏ బి సి డిలు వచ్చాయి.పిల్లలకుకూడా
గుర్తుండేవి ఏ బిసిడిలు మాత్రమే! విద్యనేది పోతోంది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, నాట్య ప్రక్రియనేది నృత్య ప్రక్రియగా
మారిపోవడం దౌర్భాగ్యం. ఈ రోజున కూచిపూడి నాట్య ప్రక్రియ దాని రూపాన్ని కోల్పోయింది.దీనికి
అందరమూ బాధ్యులమే! కూచిపూడి
భాగవతులు కావచ్చు, భాగవతేతరులు
కావచ్చు. ఎవరైనా సరే
ధర్మాన్ని కొనసాగించాలి.
నాట్యాన్ని
మనం ఒక్కళ్ళమే చేయడం లేదు. కథాకళి, కన్నడ యక్ష గానాలు,మేలటూరు
భాగవతులు వగైరాలెందరో చేస్తున్నారు. కాంటెంపరరీ వాళ్ళుకూడా నాటక ప్రక్రియను చూపిస్తున్నారు కదండీ. నాటకాల్లోని
లోపాలను మనం ఒక్కళ్ళమే వెదుక్కుంటున్నామా?
ఇదంతా కేవలం
వ్యక్తిగతంగా పేరు సంపాదించుకోవడం కోసం, వ్యక్తిగత లాభాలు,ఆర్థిక పరిపుష్టికోసం
నాటకాలను తొక్కేస్తూ కూచిపూడినాట్యాన్ని బతికిస్తున్నామని మనం బతుకుతున్నామేమో ?. దీన్ని మన
అంతరాత్మ ఏపరిస్థిలోనూ ఒప్పుకోకూడదు. ఇంతటి
సాహితీవేత్తలు, విమర్శకులూ
సైతం కళ్ళున్నగుడ్డివాళ్ళుగా వ్యవహరిస్తున్నారు. నాట్య ప్రక్రియను నృత్య ప్రక్రియగా
మార్చే హక్కు ఎవరికి ఉంది అని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. రచయితలు
..విమర్శ కులూ కూడా మెచ్చుకోళ్ళకోసమే రాస్తున్నారు తప్ప, విచక్షణ
మరచిపోతున్నారు. యక్షగానాలు
నృత్య నాటికలయ్యాయి, నాటికలు
రూపకాలుగా మారినయి… ఇలా
మారుతున్నాయన్నది గ్రహించండి. ఎన్ని మార్పులు చేర్పులు
జరిగినా నాటకధర్మంమాత్రం పోలేదు. ఈ సోలో ప్రదర్శనలతో
సంచారీలు చేస్తూ నాటకీయత చూపిసున్నాం అని వాదించా వచ్చేమో గానీ నాటక ధర్మం పోతోందికాదా . చతుర్విధాభినయాల్లో లోటు
జరుగుతూన్నట్లేగా ?
నాట్యం తన్నాటకంచైవ ... పూజ్యులు
పూర్వులు చెప్పినమాట ఆచంద్రతారార్కం వర్ధిల్లుగాక ...........
-- తాడేపల్లి